– త్రుటిలో సెంచరీలు చేజార్చుకున్న ఇంగ్లీష్ బ్యాటర్లు
– రెండో టెస్టులో ఇంగ్లాండ్‌కు 67 పరుగుల ఆధిక్యం
మంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆటలో ఇంగ్లీష్ బ్యాటర్లు జాక్ క్రాలీ (189), జో రూట్ (84) త్రుటిలో డబుల్, సెంచరీలను చేజార్చుకున్నారు.
ఇక ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (54) అర్ధ సెంచరీ సాధించాడు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 384 పరుగులు చేసి, 67 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టగా, జోష్ హజిల్‌వుడ్, కామెరున్ గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులను ఆస్ట్రేలియా గెలుచుకోగా, మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.