సెంచరీకి చేరువలో విరాట్‌

0
4

సెంచరీకి చేరువలో విరాట్‌
– అర్ధసెంచరీలతో రాణించిన రోహిత్‌, జైస్వాల్‌
– మళ్లీ నిరాశపరిచిన జైస్వాల్‌, గిల్‌
– విండీస్‌తో రెండో టెస్టు
ట్రినిడాడ్‌: విండిస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, యశస్వీ జైస్వాల్‌ తొలి వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో జాసన్‌ హోల్డర్‌ వేసిన 32వ ఓవర్‌లో నాలుగో బంతికి జైస్వాల్‌ క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సెంచరీకి చేరువలో ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (80) వారికన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఇక శుభ్‌మన్‌ గిల్‌ (10), అజింక్యా రహానె (8) నిరాశ పరచగా, రన్‌ మిషన్‌, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ (87, నాటౌట్‌), ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా (36, నాటౌట్‌) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. విండీస్‌ బౌలరల్లో కీమర్‌ రోచ్‌, గాబ్రియెల్‌, వారికన్‌, హోల్డర్‌లకు తలో వికెట్‌ దక్కింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టును రోహిత్‌ సేన గెలుచుకున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here