ఎన్నికల దృష్ట్యా 24 గంటలు వాహన తనిఖీలు
ఎస్పీ అఖిల్ మహాజన్
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 6 చెక్ పోస్టులు (తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధి – జిల్లెళ్ల చెక్ పోస్ట్, గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధి – పెద్దమ్మ చెక్ పోస్ట్, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి – వెంకట్రావ్ పల్లి చెక్ పోస్ట్, వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి – ఫజుల్ నగర్ చెక్ పోస్ట్,
బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి – కొదురుపాక చెక్ పోస్ట్, రుద్రాంగి పోలీస్ స్టేషన్ పరిధి – మనాల క్రాస్ రోడ్ చెక్ పోస్ట్) ఏర్పాటు చేసి మద్యం, డబ్బు ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలపలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
మంగళవారం తంగళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెల్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఎస్పీ తనిఖీ చేసి చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి మద్యం, డబ్బు సరఫరా కాకుండా జిల్లాలో పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
చెక్ పోస్ట్ ల వద్ద జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ మద్యం, డబ్బు రవాణా అడ్డుకట్ట వేయాలని చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబందనలు పాటించాలని సూచించారు.
తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లినట్లయితే సీజ్ చేయడం జరుగుతుందన్నారు.
అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు డబ్బులను తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకెళ్లాలని సూచించారు.
నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమమని సూచించారు.
ఎన్నికల నియమావళిని అందరూ పాటిస్తూ వాహనాల తనిఖీలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.