Indicators: సూచిక బోర్డులు మరిచారు!

0
15

ఎటు వెళ్లాలో తెలియక ప్రయాణికుల ఇబ్బందులు


రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సుమారు 30 కిలోమీటర్ల మేర నిజామాబాద్ జిల్లా నుంచి సిరిసిల్ల జిల్లాను కలుపుతూ రెండు వరుసల ప్రధాన రహదారులు ఉన్నాయి.

ప్రధాన రహదారిని నిర్మించి అలాగే వదిలేయడంతో నిజామాబాద్ జిల్లా నుంచి నిత్యం వందల మంది ప్రయాణికులు వేములవాడలోని దక్షిణ కాశీగా పేరు పొందిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వస్తూ ఉంటారు.

అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వివిధ పనుల నిమిత్తం రహదారిపై చాలామంది ప్రయాణిస్తూ ఉంటున్నారు.

నిజామాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు మరిమడ్ల గ్రామంలోని లోతు ఒర్రె దాటిన తర్వాత మూలమలుపు వద్ద రెండు ప్రధాన రహదారులు దర్శనమిస్తాయి.

ఒకటి వేములవాడ వెళ్లడానికి, ఇంకొకటి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రావడానికి రెండుగా చీలి ఉంటాయి. ఇక్కడ సంబంధిత ఆర్అంబ్‌బీ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేకపోవడంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురై ఇబ్బందులు పడుతున్నారు.

ఉదయం పూట ఎవరినో ఒకరిని అడిగి వెళుతున్నమని రాత్రి సమయంలో మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రయాణికులు అంటున్నారు.

అంతేకాకుండా సిరిసిల్ల నుంచి మరిమడ్ల వరకు రెండు వరుసల ప్రధాన రహదారిపై మూడు కూడలిలు కలిసే చోట అధికారులు సంబంధిత గ్రామాలకు వెళ్లే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్లపై మూలమలుపుల వద్ద అక్కడక్కడ ప్రమాదకరంగా ఉండే పెద్ద ప్రచార బోర్డులను డబ్బులు రావడానికి ప్రచారాలకోసం ఏర్పాటు చేస్తున్నారు.

కానీ ప్రయాణికులకు ప్రజలకు అవసరమయ్యే వాటి మీద సంబంధిత అధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

ప్రతిపాదనలు పంపాం: ఆర్అండ్‌బీ ఏఈ సతీష్
ప్రధాన మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం.

సంబంధించిన పనులకు అధికారుల నుంచి ఆదేశాలు జారీ కాగానే సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. అలాగే రోడ్లపై ఉన్న పెద్ద హోర్డింగులు ఎవరు ఏర్పాటు చేశారో తెలియదు.

అనధికారికంగా అలాంటి వాటిని ఏర్పాటు చేసినట్లయితే వెంటనే తొలగిస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here