– నాన్న రాసిన సోషలిజం బుక్స్ అంటే ఇష్టం
– చేగువేరా కూతురు డా.అలైదా గువేరా
‘నాన్నతో అనుభవం మెరుపు లాంటి అనుభూతి. అమ్మ అద్భుతమైన మనిషి. మా అమ్మ పేరు కూడా నా పేరే. నాన్న ప్రేమించిన వ్యక్తి పేరు కాబట్టి ఆ పేరే నాకూ పెట్టారు’ అని మార్క్సిస్ట్ విప్లవకారుడు చేగువేరా కుమార్తె డా.అలైదా గువేరా అన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆమె చేగువేరా మనవరాలు ప్రొ. ఎస్టే ఫానియా గువేరా కలిసి ఆదివారం ఉదయం కోల్‌కతా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా అలైదా గువేరా మాట్లాడుతూ క్యూబా లో పేదోళ్లలా బతుకుతం.. కానీ ధనికుల్లా చనిపోతామన్నారు. అక్కడ వసతులు అలా ఉంటాయన్నారు. మహిళలకు అన్నిరకాల మోటివేషన్తో పాటు సమాన పని.. సమాన వేతనం ఉంటుందని చెప్పారు. నాన్న 24 గంటలు పని చేసే వారని, సామాజిక సేవలో ముందుటారని తెలిపారు. సోషలిజం కోసం నాన్న రాసిన బుక్స్ అంటే చాలా ఇష్టమన్నారు. చేగువేరా, వైద్యం రెండు అంశాలపై బుక్ రాస్తున్నానని, వీటికోసం నాన్న రాసిన బుక్స్ అన్నీ చదవాల్సి వచ్చిందన్నారు. బులేవియన్ గురించి రాసిన బుక్ చదవాలంటే మాత్రం కష్టంగా అనిపించిందని, ఎందుకంటే చివరి పేజీ ఆయన మరణం గురించి ఉంటుందని భావోద్వేగానికి గురయ్యారు. ఫిడెల్ క్యాస్ట్రో తో నాన్న కంటే ఎక్కువ సమయం గడిపా చెప్పుకొచ్చారు. చేగువేరా నుంచి మైనా నేర్చుకోవచ్చని, ఆయన ఐడియాలజీ కమ్యూనిజం.. అలాగే బతికాడు అలాగే చనిపోయాడంటూ అలైదా తన ప్రసంగాన్ని ముగించారు.