అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే దళితబంధు

0
21
  • రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే, డా. రసమయి బాలకిషన్
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణ

అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే, డా. రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో భారత రాజ్యంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్నిఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమానతలు, అంటరానితనం నిర్మూలనకై అహర్నిశలు పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అంబేడ్కర్‌ అని కొనియాడారు. అంబేద్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా రాష్ట్రంలోని ద‌ళితుల‌కు అన్ని రంగాల్లో స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులును ద‌ళితుల సంక్షేమం కోసం వినియోగిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు దేశానికి ఆద‌ర్శంగా నిల‌వ‌బోతుంద‌న్నారు. విడత‌ల వారీగా ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి ద‌ళిత బంధును అంద‌జేస్తామ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత రాష్ట్రంలో ఎస్సీ గురుకులాల‌ను రెట్టింపు చేశామ‌న్నారు. 50 మ‌హిళా గురుకుల డిగ్రీ కాలేజీల‌ని నెల‌కొల్పామ‌ని గుర్తు చేశారు. అంత‌టితోనే ఆగ‌కుండా పీజీ, లా కాలేజీల‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని పేర్కొన్నారు. దళిత విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాల‌ర్‌షిప్‌ కింద రూ. 20 లక్షల గ్రాంటు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్, జెడ్పీటీసీ శ్రీమతి కనగండ్ల కవిత తిరుపతి,మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు పాకాల మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీమతి చెలుకల సభిత తిరుపతి రెడ్డి,భారస రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ శ్రీమతి ద్యావ రాజశ్రీ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హన్మండ్ల లక్ష్మారెడ్డి, సర్పంచ్లు ఫోరం మండల అధ్యక్షులు చింతలపల్లి సంజీవ రెడ్డి, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బోనగిరి శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల శేఖర్ బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు మాంకాల బాలయ్య, మొదుంపల్లి రాజు,మాంకాల పోచమల్లు,మాంకాల నగేష్, మాంకాల సంపత్, యాలల పర్షరాములు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here