మూసీ గేట్లు ఎత్తివేత

0
30

– 17,250 క్యూసెక్కుల నీరు కిందకు వదిలిన అధికారులు
– హిమాయత్‌ సాగర్‌లోకి1300, ఉస్మాన్‌ సాగర్‌కు 700 క్యూసెక్కులు వరద
– రెండు గేట్లు ఎత్తిన అధికారులు
హైదరాబాద్‌/ప్రజానావ: భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లోకి వరద పోటెత్తింది. దీంతో హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. హిమాయత్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1761.45 క్యూ సెక్కులుగా ఉంది. దీంతో ప్రాజెక్టులోకి చేరిన 1300 క్యూసెక్కుల వరదను అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని మూసీకి విడుదల చేశారు. అలాగే ఉస్మాన్‌ సాగర్‌కు 700 క్యూసెక్కుల వరద రావడంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మరోవైపు హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీకి 17,250 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మూసీ పూర్తిస్థాయి నీటి మట్టం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని వచ్చినట్లే ఏడు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here