ఆసరా@ రూ.4016

0
14

– ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్‌ సర్కార్‌
– పెరిగిన పింఛన్‌ ఈ నెల నుంచే
దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూడ్‌ చెప్పింది. గత మంచిర్యాల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దివ్యాంగులకు రూ.1000 పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో దివ్యాంగులకు రూ. 1000 పెంచుతున్నట్లు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

పెరిగిన పింఛన్‌ ఈ నెల నుంచే ఖాతాలో జమ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూ.200 ఉన్న పింఛన్‌ను కేసీఆర్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక పెంచిన విషయం తెలిసిందే. ఇంతకుముందు రూ.3016 ఉన్న పింఛన్‌ను రూ.4016కు పెంచారు. తెలంగాణ సర్కార్‌ నిర్ణయంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌ వాసుదేవ రెడ్డితో పాటు మరికొందరు సచివాలయం వెళ్లి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పింఛన్‌ను పెంచినట్లు తెలిపారు. మరోవైపు పింఛన్‌ పెంపుతో రూ.205 కోట్లకు పైగా ప్రభుత్వం భారం పడనుండగా, 5లక్షల 11వేల మందికి పైగా లబ్ధి పొందనున్నారు. ఇక సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలాఉంటే గురుకులు హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం సైతం సీఎం కేసీఆర్‌ మానవీయకోణంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం, వసతులను అందించేందుకు ప్రస్తుతం అందిస్తున్న డైట్‌ ఛార్జీలను పెంచుతూ సంబంధిత ఫైల్‌పై శనివారం సంతకం చేశారు. దీంతో పెరిగిన డైట్‌ ఛార్జీలు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here