బ్రాత్‌ వైట్‌ హాఫ్‌ సెంచరీ

0
5

– భారత్‌-విండీస్‌ రెండో టెస్టు
– ఆటను మధ్యలోనే అడ్డుకున్న వరుణుడు
– ప్రస్తుతం వెస్టిండీస్‌ 208/5

ట్రినిడాడ్‌: భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. మూడో రోజైన శనివారం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. మూడో సెషన్‌లో వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్‌, ఓపెనర్‌ బ్రాత్‌ వైట్‌ (75) పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా, మరో ఓపెనర్‌ తగెనరైన్‌ చంద్రపాల్‌ (33), మెంకజీ (32), బ్లాక్‌వుడ్‌ (20), జోషువా డిసిల్వా (10) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం క్రీజులోఅథనాజే (28, నాటౌట్‌) ఉన్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకు 2 వికెట్లు దక్కగా, అశ్విన్‌, సిరాజ్‌, ముఖేశ్‌ కుమార్‌ ఒక్కో వికెట్‌ తీశారు. కాగా, భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here