బెంగళూరులో జరిగిని విపక్షాల భేటీకి హాజరై తిరిగి వెళ్తుండగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విపక్షాల భేటీకి హాజరైన వీరు ప్రయాణిస్తున్న విమానం మధ్యప్రదేశ్లోని భోపాల్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు అక్కడి పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా ఓ వార్త సంస్థకు తెలిపారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు తెలుస్తోంది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉంటే ఇదే విషయమై వివరాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.