దేశం కోసం వాళ్లేమీ చేయరు

0
10

– అందుకే వాళ్లవి విద్వేషం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు
– కుటుంబ పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలు

దేశం కోసం వాళ్లేమీ చేయరు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే అని ఉంటాయి. కానీ కుటుంబ పార్టీల్లో మాత్రం కుటుంబాల చేత.. కుటుంబాల కోసమే.. కుటుంబాల కొరకే అని ఉంటుందని కుటుంబ పార్టీలపై (విపక్షాలు) ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఎయిర్‌పోర్ట్‌ బ్లెయిర్‌లో బిల్డింగ్‌ను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ తొమ్మిదేళ్లో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని, యూపీఏ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దినట్లు పేర్కొన్నారు.

ఇక కేవలం కుటుంబాల కోసమే పనిచేసే కొన్ని పార్టీలు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నాయని, అభివృద్ధి అనే మాటెత్తకుండా, కేవలం వారి స్వార్థ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటాయని విమర్శించారు. దేశ ప్రజలు తమని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని, అది తెలిసే విపక్షాలు బెంగళూరులో దుకాణాలు పెట్టాయన్నారు. ’24కేలియే 26 హోనే వాలే రాజనైతిక్‌ దలోన్‌ పర్‌ యే బడా ఫిట్‌ బైతా’తాహై అంటూ పాటలు పాడుతున్నాయని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here