ఐఎస్‌బీసీ గౌరవ చైర్మెన్‌గా ఎస్‌ఎస్‌ రాజమౌళి

0
20

జనవరిలో స్కూల్స్‌ క్రికెట్ ప్రపంచకప్‌ నిర్వహణ
భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి స్కూల్‌ క్రికెట్ బలోపేతానికి ముందుకొచ్చారు. స్కూల్‌ స్థాయి నుంచే అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసేందుకు ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌‌ ఫర్‌ క్రికెట్‌ (ఐఎస్‌బీసీ) మూడంచెల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌ వేదికగా స్కూల్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ జరుగనుండగా.. ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ క్రికెట్‌ గౌరవ చైర్మెన్‌గా రాజమౌళి ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఐఎస్‌బీసీ ఫౌండర్‌ సీఈవో సునీల్‌బాబు కొలనుపాక వెల్లడించారు.

జనవరిలో స్కూల్స్‌ ప్రపంచకప్‌..
2024 జనవరిలో స్కూల్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఎనిమిది దేశాలు పోటీపడనున్నాయి. అంతకుముందు, ప్రాజెక్ట్‌ స్కూల్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో ఇంటర్‌ డిస్ర్టిక్‌, ఇంటర్‌ స్టేట్‌, ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌ (ఐఎస్‌టీఎల్‌) నిర్వహిస్తారు. ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌లో ఎనిమిది ప్రాంఛైజీలు ఆడతాయి. ఈ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు స్కూల్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది.

మెగా టాలెంట్‌ హంట్‌..
ఇక ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌, ప్రాజెక్ట్‌ స్కూల్ వరల్డ్‌కప్‌లో భాగమయ్యేందుకు ఐస్‌బీసీ.. మెగా టాలెంట్‌ హంట్‌కు సిద్ధమైంది. 12-16 ఏళ్ల యువ క్రికెటర్లు తమ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో కూడిన 60 సెకండ్ల నిడివిగల వీడియోను ఐఎస్‌బీసీ వెబ్‌సైట్‌ లేదా ఐఎస్‌బీసీ యాప్‌లో పోస్ట్‌ చేయాలి. ఐఎస్‌బీసీ చీఫ్‌ మెంటార్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సారథ్యంలోని నిపుణులు వీడియోలను పరిశీలించి ప్రతి జిల్లా నుంచి 400 మంది క్రికెటర్లను ఎంపిక చేయనున్నారు. ఈ విధంగా ఎంపికైన 400 మంది వర్థమాన క్రికెటర్లు జిల్లా స్థాయి స్కూల్‌ క్రికెట్‌ లీగ్‌లో పోటీపడేందుకు అర్హత సాధిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here