రేపటి నుండి పాఠశాలల్లో పఠనోత్సవం
ప్రజానావ, హైదరాబాద్
విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచేందుకు రాష్ట్ర విద్యా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు తమ రోజు వారీ జీవితంలో చదువు ఒక అలవాటుగా మారాలని, విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలన్న లక్ష్యంతో సోమవారం( ఈ నెల 26 ) నుంచి జులై 31 వరకు అన్ని పాఠశాలల్లో పఠనోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు రోజూ ప్రతి తరగతికి ఒక పీరియడ్‌ను పఠనానికి కేటాయించాలని మార్గదర్శకాలను జారీ చేసింది.