ఈదురు గాలులకు నేలకూలిన ఇల్లు

0
4

– బాధిత కుటుబానికి కాంగ్రెస్‌ నేతల పరామర్శ
ప్రజానావ/జూబ్లీహిల్స్‌: ఖైరతాబాద్‌ నియోజకవర్గం జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఫిల్మ్‌ నగర్‌ రోడ్‌ నెంబర్‌ 9లో బస్తీలో ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి లక్ష్మి అనే మహిళకు చెందిన ఇల్లు నేల కూలింది. వర్షంతో ఇంట్లోని సామగ్రి అంతా నీటిపాలైంది. ఈ విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్‌ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాటూరి రమేశ్‌ సోమవారం స్థానిక నేతలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈసందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ అధికారులతో తక్షణమే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార పార్టీ నాయకులకు కాకుండా, పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జై అశోక్‌ కుమార్‌, కవిత, రాధా, సుశీల తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here