తండ్రి తప్పు.. తనయ దిద్దుబాటు

0
10

– కబ్జా చేసిన భూమిని కూతురిపై రిజిస్ట్రేషన్ చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
– ఇట్టి భూమిని మున్సిపల్ కు అప్పగించేందుకు ముత్తిరెడ్డి కూతురు తుల్జాభవాని నిర్ణయం

ప్రజానావ హైదరాబాద్: జనగాం బీఅర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్‌కి తిరిగి ఇచ్చేందుకు ఆయన కూతురు తుల్జా భవాని నిర్ణయం తీసుకున్నారు. చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట 21 గంటల స్టలాన్ని తన తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసాడంటూ తుల్జాభవాని రెడ్డి ఆరోపించారు.

ఈ స్థలంపై గతంలో అనేక వివాదాలు, ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలున్నాయని, ఈ నేపథ్యంలోనే ఇట్టి భూమి తన పేరిట తన తండ్రి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని తుల్జాభవాని తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భూమిని మున్సిపాలిటీకీ.. ఆస్పత్రికి ఇచ్చేందుకు తుల్జాభవాని రెడ్డి పేరుతో నోటీసు బోర్డు వెలవడం సంచలనంగా మారింది. మొత్తానికి తుల్జాభవాని నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here