సిఈఐఆర్ టెక్నాలజీతో ఫోన్ లు స్వాధీనం

0
37

– పోగొట్టుకున్న బాధితులకు అప్పగింత

ప్రజానావ, వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన యువకులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా కనుక్కొని వేములవాడ పోలీసులు తిరిగి బాధితులకు అప్పగించారు. ఈ సందర్బంగా పట్టణ సిఐ వెంకటేష్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసి , బ్లాక్ చేయటం జరిగింది.

వెంటనే ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకుని పోగొట్టుకున్న వ్యక్తులకు అప్పగించారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా వెంటనే CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చన్నారు. దీని ద్వారా కోల్పోయిన ఫోన్ ను తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here