మోత్కులగూడెంలో ఉచిత వైద్య శిబిరం

0
23

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ప్రజానావ, జమ్మికుంట:  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హుజరాబాద్, జమ్మికుంట ఆధ్వర్యంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మొత్కులగూడెం లో ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లల వైద్యం, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధి, ముక్కు చెవి గొంతు, కంటి వైద్యం, స్త్రీల సంబంధిత, సాధారణ వైద్య విభాగం తోపాటు వివిధ జబ్బులకు వైద్య నిపులచే రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

300 మంది వైద్య పరీక్షలు చేసుకోగా.. వారికి మందులు అందజేశారు. ఈ సంధర్బంగా వైద్యులు మాట్లాడుతూ, పల్లెకు పోదాం.. ఛలో ఛలో.. కార్యక్రమంలో భాగంగా మోత్కులగూడెంకు చెందిన వైద్యుల సూచనల మేరకు, స్ధానిక కౌన్సిలర్ల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఇదే విధంగా పలు గ్రామాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హుజూరాబాద్, జమ్మికుంట అధ్యక్షులు డాక్టర్ సుధాకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉడుగుల సురేష్, గ్రామ వైద్యులు ఉడుగుల సురేష్, ఆకుల శ్రీనివాస్, కాoశెట్టి కిషోర్ లతోపాటు పట్టణ వైద్యులు సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి,సత్యం, వాణి, సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్, స్ధానిక కౌన్సిలర్లు పొనగంటి రాము, పోనగంటి శ్రీలత, పొనగంటి విజయ గ్రామస్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here