ప్రజానావ/వేములవాడ: నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) వేములవాడ నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక మార్కండేయ నగర్ లో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ సమావేశం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొప్పుల బుచ్చిరాములు, ఎన్నికల అధికారి జుట్టు మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా కోడెం కనకయ్య, ఉపాధ్యక్షుడిగా ఏనుగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తాటిపెల్లి నరసింహస్వామి, కోశాధికారిగా జక్కుల మహేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నరెడ్ల నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా నూనె లింగయ్య, చందనం ప్రవీణ్, ముంజ సందీప్, బండవరం నాగరాజు, పందిల్ల శరత్ కుమార్, ఆకుల కమలాకర్, సుల్తాన్ శేఖర్, చిలుక బాబు, బొడుసు మహేశ్‌లు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని వేములవాడ ప్రముఖులతో పాటు జర్నలిస్టులు అభినందించారు.