కేసీఆర్, కేటీఆర్, కవిత చిత్రపటాలకు క్షీరాభిషేకం

0
20

ప్రజానావ/వేములవాడ: మినీ అంగన్‌వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు సంధ్య ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి చౌరస్తాలో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. మినీ అంగన్‌వాడీ టీచర్లను ప్రధాన అంగన్‌వాడీ టీచర్లుగా అప్ గ్రేడ్ చేసి అనేక సంవత్సరాల కల నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మినీ అంగన్‌వాడీ టీచర్లంతా రుణపడి ఉంటారని అన్నారు . అలాగే ఉద్యోగ విరమణ వయస్సు టీచర్లకు 65 ఏళ్లు పొడిగించడం, ఉద్యోగ విరమణ సమయంలో సర్వీస్ బెనిఫిట్స్ కింద రూ.లక్ష ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామమని అన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత నెలనెలా ఆసరా పింఛన్‌ ఇచ్చే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందన్నారు. వేతనాల పెంపుతో పాటు సెలవుల విషయంలో కూడా సమాన గౌరవాన్ని కల్పించడం జరిగిందన్నారు. గత ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేసి కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. మినీ అంగన్‌వాడీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 3989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లకు ఎలాంటి షరతులు లేకుండా వారి కుటుంబాలకు న్యాయం చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. దీనికి సహకరించిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్‌లకు మినీ అంగన్‌వాడీలు ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here