వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయమే రైతులు ఆందోళన దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ్యాచర్ వచ్చి 15రోజులు గడుస్తున్నా ఇప్పటికీ లారీలు రాలేదని, రాత్రి కురిసిన వర్షంతో ధాన్యమంతా తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే లారీలను పంపించాలని కోరారు. రహదారిపై రైతులు ఆందోళనకు దిగారన్న విషయం తెలుసుకున్న వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ వెంటనే అక్కడకు చేరుకొని రైతులను శాంతిపజేశారు.
అధికారులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. అనంతరం డీసీఓ అనుపురం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, పదిరోజుల్లో ధాన్యాన్ని పూర్తిగా తరలిస్తామని రైతాంగానికి హామీ ఇచ్చారు.