Indo Nepal Awards: ఆ అవార్డుల ఉత్సవానికి సంచలన దర్శకుడు

0
52

వచ్చే నెల జూన్ 9న నేపాల్‌లోని జనక్ పూర్‌ధామ్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ఇండో-నేపాల్ అంతర్జాతీయ అవార్డుల ప్రధాన ఉత్సవానికి గౌరవ అతిథిగా నిత్య ప్రయోగశీలి, విలక్షణ దర్శకుడు డా. పీసీ ఆదిత్యకు బీహార్‌కు చెందిన నీరజ్ గ్రీన్ ఇండియా పరివార్ ఫౌండేషన్ అధినేత నీరజ్ గుప్తా ఆహ్వాన పత్రం పంపించారు.

దక్షిణ భారత సినీ రంగంలో పలు ప్రయోగాత్మక సందేశాత్మక చలనచిత్రాలను రూపొందించి ప్రఖ్యాతిగాంచిన దర్శకుడు డా. పీసీ ఆదిత్య మేం నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాతీయ అవార్డుల ఫంక్షన్‌లో గౌరవ అతిథిగా పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంటుందని నీరజ్ గుప్తా అన్నారు.

ఇదే విషయమై దర్శకుడు పీసీ ఆదిత్య స్పందిస్తూ తను గతంలో షూటింగ్ నిమిత్తం నేపాల్ దేశంలో వారి లొకేషన్లను సందర్శించానని, ఈసారి గౌరవ అతిథిగా గ్రీన్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించే అంతర్జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనడం తెలుగు దర్శకుడిగా గర్వంగా ఉందని పేర్కొన్నారు.

అలాగే తన రాబోయే సినిమా షూటింగ్‌లను నేపాల్‌లోని అందమైన ప్రకృతిలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆదిత్య తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here