– నేటి నుంచి భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్
– మ్యాచ్‌కు వర్షం ముప్పు
ట్రినిడాడ్: భారత్, వెస్టిండీస్ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ టీ20 సిరీస్‌కు జట్టు మేనేజ్‌మెంట్ సీనియర్లకు విశ్రాంతి కల్పించి, పూర్తిగా కుర్రాళ్లకే అవకాశం కల్పించింది. ఇదిలాఉంటే ఈ సిరీస్‌తో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మతో పాటు యశస్వీ జైస్వాల్ ఆరంగేట్రం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే శుభ్‌మన్ గిల్‌తో యశస్వీ ఓపెనింగ్ చేస్తాడు. ఇక ఇషాన్ కిషన్‌చ సంజూ శాంసన్‌లో ఎవరిని ఆడిస్తారో చూడాలి. ఒకవేళ కిషన్ జట్టులో ఉంటే మూడో స్థానంలో, ఆ తర్వాత స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్‌యాదవ్‌లు ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. అయితే టీ20లకు పెట్టింది పేరుగా ఉండే వెస్టిండీస్ జట్టును భారత్ కుర్ర జట్టు ఏ మేరకు నిలువరించగలుగుతుందో చూడాలి. ఈ టీ20 మ్యాచ్‌లు డీడీస్పోర్ట్స్, జియో సినిమాలో రాత్రి 8 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
తుది జట్లు (అంచనా):
భారత్: శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యావ్, యుజ్వేంద్ర చహల్/రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్/ఆవేశ్‌ఖాన్, ముకేశ్ కుమార్
వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్‌మెయిర్, రోమన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ ఛేజ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, ఒడియన్ స్మిత్, అఖిల్, అల్జారి జొసెఫ్.