ప్రజానావ/ఖైరతాబాద్: జూబ్లీహిల్స్ డివిజన్‌లోని ఫిల్మ్ నగర్ గవర్నమెంట్ రౌండ్ టేబుల్ స్కూల్ లో డి-వామిటింగ్(నట్టల నివారణ )టాబ్లెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ వెల్డండ వెంకటేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మందులను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల దృష్ట్యా విద్యార్థులను ఈ మందులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డా. సుధ, ఆశా వర్కర్లు, స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, స్కూల్ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు మారెమ్మ, భాగ్య, హఫీసా బేగం, దయ్యాల దాస్, అబ్దుల్ గని, శేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.