తొలి టీ20 విండీస్‌దే

0
14

– 4 పరుగుల తేడాతో ఘన విజయం
ట్రినిడాడ్‌: భారత్‌తో స్వదేశంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కెప్టెన్‌ పావెల్‌ (48), వికెట్‌ కీపర్‌ పూరన్‌ (41), బ్రాండన్‌ కింగ్‌ (28) రాణించారు. భారత బౌలర్లలో ఆర్ష్‌దీప్‌ సింగ్‌, చాహల్‌ రెండేసి వికెట్లు తీయగా, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా విండీస్‌ బౌలర్ల ధాటికి 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బ్యాటర్లలో ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేసిన తిలక్‌ వర్మ (39) , సూర్యకుమార్‌ (21) తప్ప మరెవరూ రాణించకపోవడంతో హార్దిక్‌ సేనకు తొలి టీ20లో ఓటమి తప్పలేదు. కరేబియన్‌ బౌలర్లలో మెక్‌కాయ్‌, జాసన్‌ హోల్డర్‌, రోమారియో షెఫర్డ్‌లు రెండేసి వికెట్లు తీయగా, హొస్సేన్‌ 1 వికెట్‌ పడగొట్టాడు. హోల్డర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here