ఒక్కో మద్యం షాప్‌కి 50లక్షల టార్గెట్‌

0
82

ఖమ్మం ఎక్సైజ్‌ శాఖ ఒక్కో మద్యం షాప్‌నకు రూ.50లక్షల టార్గెట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల వరుస ఎన్నికలతో ఆదాయం తగ్గముఖం పట్టింది. దీంతో ఆ లోటును పూర్తిచేసేందుకు ఎక్సైజ్‌ శాఖ ఈ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

గతేడాది ఇదే మే నెలలో ఒక్క ఖమ్మం జిల్లాలోనే రూ.219 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది ఎన్నికల కోడ్‌తో మద్యం విక్రయాలు అంతంత మాత్రమే సాగాయి.

ఈ ఏడాది మే నెలలో ఇప్పటివరకు రూ.196.33 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. దీంతో రానున్న రోజుల్లో ఆ లోటును భర్తీ చేసేవిధంగా ఒక్కో మద్యం షాపునకు రూ.50లక్షల టార్గెట్‌ ఇచ్చినట్లు సమాచారం.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతాయి. 2001లో మార్చి-మే నెలలో రూ.81కోట్ల మద్యం అమ్ముడు పోయింది. ఇదే 2022లో రూ.3వేల కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. 2023లో రూ.720 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here