dogbite: ఎండాకాలానికి కుక్కకాట్లకు సంబంధమెంటి?

0
159
  • ఈ ఏడాది ఒక్క మే నెలలో 16వేల మందిని కరిచిన కుక్కలు
  • ఈ ఏడాదిలో 1,42,080 మంది బాధితులు
  • ఆస్పత్రుల్లో తగ్గిన యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్లు

ఎండాకాలానికి కుక్కకాట్లకు సంబంధమెంటి? అవును మీరు చదివింది నిజమే. ఎండ ప్రభావం మనుషులపైనే కాదు.. మూగజీవాలపైనా ఉంటుంది. దీనికి ఉదాహరణే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌.

ఇక్కడ ప్రస్తుతం ఉష్ణోగ్రత 48.8 డిగ్రీలు దాటింది. దాదాపు 138 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో ఈస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి. వేడి కుక్కలపై అధికంగా ప్రభావం చూపుతుంది.

విపరీతమైన ఉష్ణోగ్రత కారణంగా కుక్కలు అసాధారణ రీతిలో ప్రవర్తిస్తుంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎండ, చలి, వాన కుక్కలను ప్రభావితం చేస్తాయి.

ఇక వేడిగాలులు కుక్కలను కోపంగా మారుస్తాయి. ఇక శీతాకాలంలో విచారంగా ఉంటాయి. ఈ కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఏడాది ఒక్క ఏప్రిల్‌లోనే 12,333 మంది కుక్క కాటుకు గురయ్యారు.

ఇక మే నెలలో ఈ సంఖ్య 16వేలు దాటినట్లు నేషనల్‌ యాంటీ రేబీస్‌ కంట్రోల్‌ ప్రోగామ్‌ డేటా పేర్కొంది. ఈ లెక్క ప్రకారం చూస్తే రోజుకు 500 మందికి పైగా కుక్క కాటుకు గురవుతున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఇప్పటివరకు దాదాపు 1,42,080 మందిని కుక్క కాటు బాధితులుగా మారారు. వీటిలో 3842 పెంపుడు కుక్కలు కాగా, 8501 వీధికుక్కలు ఉండడం విశేషం.

వేసవిలో కుక్కల్లో కార్టిసాల్‌ హార్మోన్‌ వేగంగా పెరుగుతుందని, దాని వేగవంతమైన పెరుగుదల కారణంగానే కుక్కలు అసాధారణంగా ప్రవర్తిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.

ఒక్కసారిగా కుక్కకాట్లు పెరగడంతో ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్లు స్టాక్‌ లేకుండా పోయాయని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here