- – నారాయణ గూడ చౌరస్తాలో 10 తలల దిష్టిబొమ్మ దగ్ధం
- ప్రజానావ, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దశాబ్ది దగా పేరుతో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలనపై దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని నారాయణగూడ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ తోకూడిన 10 తలల దిష్టి బొమ్మను ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ప్రధాన కార్యదర్శి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి దహనం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు తోపులాటలు జరిగాయి. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.