- ఖమ్మం జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని ఆ మాటను నిలబెట్టుకుంటానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.చిన్న మధ్యతరహా పత్రికలు కు చెందిన జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ సారథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను బుధవారం కలసి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. ఖమ్మం నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో సగం మందికి పైగా రెవెన్యూ సర్వే జరిగిందని, మిగిలిన చిన్న, మధ్యతరహా పత్రికల జర్నలిస్టులు ఖమ్మం జిల్లా కేంద్రంలోనే విధులు నిర్వర్తిస్తున్నందున వారికి ఇళ్ల స్థలాలు ఖమ్మంలోనే వర్తింపజేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కోరారు. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందిస్తూ ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీకిచ్చిన మాటను నిలుపుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని పటిష్టంగా అమలు పరుస్తానని మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు డీపీఆర్ఓకు తెలియజేసి సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులు సంయమనం పాటించాలని ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఇచ్చిన హామీని నిలుపుకుంటారన్న విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉందని అన్నారు. ఖమ్మం నిండు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు జరుగుతుందని, ఎవరు కూడా ఆందోళన చేందాల్సిన అవసరం లేదన్నారు.