రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో నందినగర్ లోని నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
తనకు రాజ్యసభ సభ్యునిగా తిరిగి అవకాశమిచ్చి ఆదరించినందుకు కేసీఆర్కు వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సమేతంగా వెళ్లి కృతజ్ఞతలు తెలిపి అధినేత ఆశీస్సులు తీసుకున్నారు.
పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ వారిని ఆశీర్వదించారు.