బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఫ్రీ ట్రైనింగ్

0
16
source: pixels website

హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా హైదరాబాద్‌లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో రెండు నెలల నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు టీఎస్‌ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డీ.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్ మెంట్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ మరియు 26 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ నెల 15-03-2024 నుంచి 25-03-2024 వరకు

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమానికి బీసీ అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్ టెస్ట్‌ను ఈ నెల 31-03-2024న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు

www.tsbcstudycircle.cgg.gov.in 15.03.2024 నుంచి 25.03.2024 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి.

ఆన్‌లైన్‌ స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా (30) మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. వివరాలకు 08723223004, 9381888746 నెంబర్లకు ఆఫీస్ వేళలో సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here