తొమ్మిదేళ్ల నాటి వివాదానికి జగన్మోహన్ రావు చెక్
చెన్నై సూపర్ కింగ్స్-సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కు ముందు ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చెలరేగిన వివాదానికి తెర పడింది.
2015లో పురుడు పూసుకున్న ఈ వివాదాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూకీతో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు చర్చించి, సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి మార్గం సుగమం చేశారు.
ఇందులో భాగంగా వాయిదా పద్ధతిలో పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని హెచ్సీఏ పెట్టిన ప్రతిపాదనను టీఎస్ఎస్పీడీసీఎల్ అంగీకరించింది. దీంతో తొలి వాయిదా చెల్లిస్తామని హెచ్సీఏ తెలియజేసింది.