24 వరకు కొండగట్టులో అర్జిత సేవలు రద్దు: ఈఓ
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈనెల 22 నుంచి 24 వరకు అన్ని అర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండ్రోజులు భక్తులు, దీక్ష స్వాములు వేల సంఖ్యలో విచ్చేసి మాల విరమణ చేయనున్నందున ఈ సేవలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.