ఉచిత దర్శనం కోసం ఇక రెండు స్లాట్లు
సీనియర్ సిటిజన్లను టీటీడీ (tirumala tirupati devasthanam) శుభవార్త చెప్పింది. కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వరుడి ఉచిత దర్శనం సీనియర్ సిటజన్ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
ఇందులో ఉదయం 10 గంటలకు ఒకటి కాగా, మధ్యాహ్నం 3గంటలకు మరొకటి ఏర్పాటు చేసింది. వీరు వయసు నిర్ధారణ కోసం ఎస్1 (s1) కౌంటర్‌లో ఫొటో ఐడీ సమర్పిస్తే సరిపోతుంది.
ఏ మెట్లు కూడా ఎక్కాల్సిన అవసరం లేకుండా మంచి సీటింగ్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. దర్శనం కోసం వెయింట్‌లో ఉన్నప్పుడు లోపల వేడి సాంబర్‌తో పాటు అన్నం, పెరుగన్నం, వేడి పాలు అందుబాటులో ఉంటాయని చెప్పింది.
ఇక రూ.20 చెల్లిస్తే రెండు లడ్డూలతో పాటు అదనపు ప్రతి లడ్డూ కోసం రూ.25 చెల్లించి తీసుకోవచ్చు. ఆలయ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతం నుంచి, కౌంటర్ వద్ద డ్రాప్ చేసేందుకు బ్యాటరీ కారు సైతం వీరికి టీటీడీ అందుబాటులోకి తెచ్చింది.
మరోవైపు సీనియర్ సిటజన్ల దర్శన సమయంలో మిగతా అన్నీ క్యూలైన్లు నిలిపివేయబడతాయని టీటీడీ పేర్కొంది.