Bandi sanjay| నేతన్నలు చస్తున్నా చలించరా?

0
26
  • ఆదుకోవడం మానేసి రాజకీయాలు చేస్తారా?
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతోనే ఈ దుస్థితి
  • తక్షణమే బతుకమ్మ చీరల బకాయిలు రూ.270 కోట్లు చెల్లించాల్సిందే
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
  • సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న లక్ష్మీనారాయణకు నివాళి
  • బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

లక్మీనారాయణ కుటుంబ ఆర్దిక పరిస్థితిని చూస్తే బాధేస్తోంది. కుటుంబాన్ని పోషించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసింది. లక్ష్మీనారాయణ భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఆత్త్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలు కూడా కామన్ గా మారే పరిస్థితి రావడం దౌర్భాగ్యం. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతన్నలను పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారు చేసినట్లే చేస్తోంది. బతుకమ్మ చీరల బకాయిలు రూ.270 కోట్లు చెల్లించడం లేదు. కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. దీంతో దిక్కులేక వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయి. ఆదుకోవాలని ఆందోళన, భిక్షాటన చేసినా స్పదించడం లేదు. ఇది మంచి పద్దతి కాదు. తక్షణమే చనిపోయిన లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలి. నష్ట పరిహారం అందించి నేతన్నల్లో భరోసా నింపాలి.

బండి సంజయ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ

సిరిసిల్ల బ్యూరో, ప్రజానావ: ‘వస్త్ర పరిశ్రమలు మూతబడి నెలలు గడుస్తున్నా పట్టించుకోరా? తినడానికి తిండిలేక నేతన్నలు చస్తున్నా చలించరా? ఆదుకోవాల్సిన పాలకులు రాజకీయాలకే పరిమితమవుతారా?’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

శనివారం రాత్రి ఆయన సిరిసిల్లకు చేరుకొని ఆత్మహత్య చేసుకున్న నేతన్న లక్ష్మీనారాయణ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్దిక పరిస్థితిని తెలుసుకొని, రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న లక్ష్మీనారాయణ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కొత్త ఆర్డర్లు ఇవ్వాలి..


నేతన్నలకు బతుకమ్మ బకాలయిలు రూ.270 కోట్లు తక్షణమే చెల్లించాలి. అట్లాగే కొత్త ఆర్డర్లు ఇచ్చి వస్త్ర పరిశ్రమ యథావిధిగా కొనసాగేలా చూడాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

అలాగే 50 శాతం విద్యుత్ సబ్సిడీని పునరుద్ధరించాలని, యార్న్ సబ్సిడీని కొనసాగించాలన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కొనసాగించి, అంతిమంగా నేతన్నలకు భరోసా ఇవ్వాలన్నారు.

దీనిపై గతంలో సీఎంకు లేఖ రాసినా స్పందన లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో నేతన్నలకు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ఈనెల 10న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిరిసిల్లలో ‘దీక్ష’ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీక్షకు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని బండి సంజయ్‌ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here