నూతనంగా నిర్మాణ పనులు జరుగుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (తెలంగాణ సచివాలయం) భవనాన్ని మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ‘డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ’ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి చేతులమీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్న విషయం విదితమే.