– తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 461 ఆలౌట్
– 135 పరుగులు వెనుకబడిన లంక
శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌట్ అయింది. మూడోరోజు మంగళవారం ఆటలో భాగంలో పాక్ బ్సాట్స్‌మన్ సౌద్ షకీల్ (208, నాటౌట్) డబుల్ సెంచరీ సాధించాడు. షకీల్ తను ఆడుతున్న ఆరో టెస్టులోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.
ఈ యువ ఆటగాడి ఖాతాలో ఇప్పటికే రెండు సెంచరీలున్నాయి. మరో బ్యాట్స్‌మన్ ఆగా సల్మాన్ (83) త్రుటిలో సెంచరీని చేజార్చుకోవడంతో పాక్ 121.2 ఓవర్లలో 461 పరుగులకు ఆలౌటై 149 పరుగుల ఆధిక్యం సాధించింది. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 5 వికెట్లు పడగొట్టగా, ప్రభాత్ జయసూరియా 3, విశ్వ ఫెర్నాండో, రజిత ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆతిథ్య జట్టు శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసి, ఇంకా 135 పరుగుల వెనుకంజలో ఉంది.