తమిళనాడులో జరిగిన సాఫ్ట్ క్రికెట్ పోటీలకు ఎంపికవడం గర్వకారణం
సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల పాఠశాల అధ్యాపక బృందం ఇటీవల తమిళనాడులో జరిగిన ఫస్ట్ సౌత్ ఇండియన్ మినీ సబ్ జూనియర్ సాఫ్ట్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ 2023కి ఎంపికై, రాణించిన సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన అన్నదాస్ వర్షితను అధ్యాపక బృందం ప్రశంసించింది. సాఫ్ట్ క్రికెట్ ఫెడరేషన్ ఇండియా, ఏషియన్ సాఫ్ట్ క్రికెట్ ఫెడరేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి 11 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. జనవరి 21 నుండి 23 వరకు తమిళనాడులో జరిగిన ఈ టోర్నమెంట్‌లో సిరిసిల్ల నుంచి వర్షిత ఎంపికవడం, పోటీల్లో రాణించడం గర్వకారణంగా ఉందని అధ్యాపకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్షితను పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్యరేఖ, ఉపాధ్యాయులు ఎలగొండ రవి, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీధర్, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ రూపికతో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించింది.