వైభవంగా వసంత పంచమి వేడుకలు

0
21

బాసర అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాల సమర్పణ

నిర్మల్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతీ దేవి జన్మదినం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు మంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here