రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

0
23

సిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కోరారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్ లో ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. కలెక్టర్, ఎన్నికల అధికారి మాట్లాడారు.

కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే ఎవరూ ఆందోళన చెందవద్దని, ఏప్రిల్ 15 వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిన పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు.

తుది ఓటరు జాబితాలో ఎవరిదైనా ఓటు హక్కు లేకపోతే సంబంధిత బూత్ లెవెల్ ఎలక్టోరోల్ ఏజెంట్ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

సి- విజిల్, 1950 నెంబర్, ఎన్జీఎస్పీకి వచ్చే ఫిర్యాదులకు సత్వర స్పందన అందిస్తామన్నారు. ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా, ప్రలోభపెట్టే విధంగా చేస్తే సీ విజిల్ అప్లికేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చని, 100 నిమిషాల్లో కంప్లైంట్ ను పరిశీలించి, వెరిఫై చేసి పరిష్కారం చూపిస్తామని తెలిపారు.

అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే విషయంలో జిల్లా సమీకృత కార్యాలయంలో డిపిఆర్ఓ నేతృతంలో ఏర్పాటైన ఎంసీఎంసీకి సమాచారం ఇవ్వాలని, దాని అనుమతితో పబ్లిష్ చేయించుకోవాలని సూచించారు.

కరపత్రాలు, పోస్టర్లపై కచ్చితంగా ముద్రించిన వారి పేరు, ఫోన్ నెంబర్ ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, యువత సోషల్ మీడియా వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు, చిత్రాలు షేర్ చేయవద్దని కోరారు. అనవసర మెసేజ్లు పెట్టి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు.

యువత కేసులపాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. కేసులు అయితే వారి భవిష్యత్తు కూడా ఎంతో ఇబ్బంది అవుతుందని ఎస్పీ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు రాజేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here