వాళ్లను కట్టేసి రజాకార్‌ సినిమా చూపించాలి

0
171

రజాకార్‌ సినిమాపై బండి సంజయ్‌

చార్మినార్ వద్ద ఓవైసీ సహా రజాకార్ల వారసులందరికీ అక్కడే ఈ సినిమా చూపించాలని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు.

ఆదివారం ఆయన కరీంనగర్‌ మమత థియేటర్‌లో రజాకార్‌ సినిమాను చిత్రబృందంతో కలిసి వీక్షించారు. అనంతరం ఇంటర్వెల్‌ సమయంలో మీడియాతో మాట్లాడారు. నిజాం రాజు చాలా గోప్పోడు అని పొగుడుతున్న వాళ్లను కట్టేసి ‘రజాకార్’ సినిమా చూపించాలన్నారు.

నిజాం తరహా పాలన రాకూడదని అనుకునేవాళ్లంతా కచ్చితంగా “రజాకార్” సినిమా చూడాలని కోరారు. మతపరంగా ‘ముస్లిం’లకు రిజర్వేషన్లు కల్పించాలని అనుకునేవారు కూడా ఈ సినిమా చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

చాకలి ఐలమ్మ తెగువ, గుండ్రంపల్లి పోరాటాలను కళ్లకు కట్టినట్లు రజాకార్ సినిమాలో చూపించారని, తెలంగాణ లోని ప్రతి ఒక్కరూ, ప్రతి హిందువు తప్పకుండా ఈ సినిమా చూడాలని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత నిజాం సమాధి వద్ద మోకరిల్లి ‘రజాకార్’ సినిమా చూసి ట్వీట్ చేయాలన్నారు. రజాకార్ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ట్వీట్ చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజల తెగువ, నిజాం నియంతృత్వం, రజాకార్ల రాక్షసత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన దర్శక, నిర్మాత, నటీనటులను ఈ సందర్భంగా బండి సంజయ్‌ అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here