ఐపీఎల్ ఫైనల్‌కు వరుణగండం
ఐపీఎల్ (indian premier league)కు వరుణ గండం పొంచిఉంది. ఆదివారం తమిళనాడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.
దీంతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అయితే తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినా చెన్నైలో మాత్రం వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
దీంతో ఇటు కేకేఆర్, అటు హైదరాబాద్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఇదిలాఉంటే మ్యాచ్ సమయానికి వర్షం పడితే అదనంగా 120 నిమిషాల సమయం కేటాయించనున్నారు.
ఒకవేళ వర్షం తగ్గుముఖం పట్టకపోతే తర్వాత రోజు (రిజర్వ్ డే) నాడు మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అయినా వర్షం తగ్గకపోతే మాత్రం పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌గా నిలిచిన కోల్‌కతాను విజేతగా ప్రకటిస్తారు.
ఇప్పటివరకు చెన్నైలో 84 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 49 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 35 మ్యాచుల్లో విజయం సాధించాయి. దీంతో ఈరోజు ఫైనల్ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది.