– ప్రధాని నరేంద్ర మోదీ
ఎన్డీయే అంటే ‘న్యూ ఇండియా డెవలప్‌మెంట్ ఆస్పిరేషన్’ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఢిల్లీలోని ఆశోక హోటల్‌లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో మోదీ పాల్గొని మాట్లాడారు. 25ఏళ్ల నుంచి ఎన్డీయే దేశ సేవలో ఉందని, ఒకరి నుంచి అధికారాన్ని లాక్కోవడమో, ఒకరికి వ్యతిరేకంగా ఎన్డీయే ఏర్పడలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అవినీతి కూటములు, బంధుప్రీతి కూటముల పొత్తులు దేశానికి హానికరమన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడానికే కాంగ్రెస్ ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఇలాంటి పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని ఈ సందర్భంగా మోదీ ఆరోపించారు. తనను తిట్టేందుకు కేటాయించిన సమయాన్ని విపక్షాలు ప్రజల కోసం కేటాయిస్తే బాగుంటుందని హితవు పలికారు. 2024లో ఎన్డీయే ఓట్ల శాతం 50 శాతానికి పైనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.