Smoke pan: పాన్‌ తింటే అంత డేంజరా?

0
523

పాన్‌ తిని ఓ బాలికి ప్రాణం మీదికి తెచ్చుకున్న ఘటన బెంగళూరులో చోటుచోసుకుంది. సాధారణంగా వేడుకల్లో ఆహారం తిన్న తర్వాత పాన్‌ తినడం సార్వసాధారణం.

పాన్‌ తింట్‌ తొందరగా జీర్ణమతుందని నమ్ముతుంటారు. అయితే బెంగళూరులో ఓ బాలిక (12) కుటుంబసభ్యులతో కలిసి ఓ వేడుకకు హాజరైంది. అక్కడ భోజనం చేసిన తర్వాత ఓ పాన్‌ ఆసక్తిగా చూసింది. వెంటనే దాననిని తిన్న ఆ బాలిక కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురైంది.

వెంటనే కుటుంబికులు బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అన్నీ పరీక్షలు చేసి బాలిక కడుపులో కొంతభాగం రంధ్రం (కోతకు గురైందని) పడిందని నిర్ధారించారు.

ఇది విని బాలిక తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఇంతకు బాలిక తిన్న పాన్‌ మామూలు పాన్‌ కాదని.. స్మోక్‌ పాన్‌ అని.. ఇది ద్రవ నత్రజనితో తయారు చేసే పాన్‌గా చెప్పారు.

అనంతరం బాలిక కడపులో కొంత భాగాన్ని వైద్యులు తొలగించారు. ఇటీవలి కాలంలో పాన్‌ తయారీదారులు కొత్తకొత్త పేర్లతో పాన్‌లను మార్కెట్‌లోకి తెస్తున్నారు. వీటిని తినేందుకు యువతకు కూడా ఆసక్తి ప్రదర్శిస్తుండడంతో వారికి తెలియకుండానే వారు ఆనారోగ్యం పాలవుతున్నారు.

ఇలాంటి పాన్‌లు తింటే ఒక్కోసారి క్యాన్సర్‌కు దారితీసే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. సంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన పాన్‌ తినడం ఆరోగ్యానికి మంచిదేనని, దానిని కూడా మితంగా తినాలని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here