chattisgarh: వామ్మో.. 20 అడుగుల లోయలో పడ్డ వాహనం

0
339
  • 17మంది అక్కడికక్కడే మృతి
  • చత్తీస్‌గఢ్‌లోని కావర్దాలో ఘటన

వాహనం లోయలో పడి 17మంది మృతి చెందిన ఘటన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కావర్దాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం కొంతమంది స్థానికులు అడవి నుంచి తెండు ఆకుల్ని సేకరించి పికప్‌ వాహనంలో తిరిగివస్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం 20 అడుగుల లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో 17మంది అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో 25మంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రమాద విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here