రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం రేపింది. గోరిలాల్వ నల్లగుంట ప్రాంతంలో చిరుతపులి చిట్టపురం గంగాధర్ అనే రైతుకు చెందిన గేదె దూడపై దాడి చేసి చంపింది.
గేదె దూడను గుడిసెలో కట్టేసి ఉంచామని రాత్రి సమయంలో చిరుత దాడి చేసి చంపిందని రైతు తెలిపాడు. గుడిసె చుట్టూ చిరుత కాలి వెలిముద్రలు కనిపించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
ఏడాది పాటు కాపాడుకున్న లేగదూడను చిరుత చంపడంతో గంగాధర్ కన్నీరుమున్నీరయ్యాడు. నల్లగుట్ట ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందన్న విషయం తెలియడంతో ఆ ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు.