Aadi srinivas: నేనున్నా.. బాధపడొద్దు

0
555
  • గణేశ్‌ భూమల్ల మృతిపై దుబాయ్‌లో విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆరా
  • స్వయంగా కంపెనీ క్యాంపునకు వెళ్లిన వేములవాడ ఎమ్మెల్యే
  • మృతదేహాన్ని త్వరగా భారత్‌కు పంపేలా చూడాలని వినతి
  • గణేశ్‌ కుటుంబసభ్యులకు వీడియో కాల్‌ ద్వారా భరోసా

గత శాసనసభ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ గల్ఫ్ కార్మికుల కుటుంబాలు తన విజయంలో కీలకపాత్ర పోషించాయని, గల్ఫ్ బిడ్డలకు కృతజ్ఞత తెలపాలని దుబాయ్‌కు వెళ్లిన ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అక్కడి గల్ఫ్‌ కార్మికులను కలవడంతో పాటు వారి సమస్యలపై ఆరా తీశారు.

ఇందులో భాగంగా దుబాయ్‌లోని అల్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన భీమారం మండలం మోత్కురావుపేట్ గ్రామానికి చెందిన గణేశ్‌ భూమల్ల (25) మృతికి గల కారణాలను స్వయంగా వెళ్లి తెలుసుకున్నారు.

దుబాయ్‌ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి చేరుకున్న ఆది శ్రీనివాస్‌ గల్ఫ్‌ వెల్ఫేర్‌ అవెర్నేస్‌ కమిటీ (GWAC) యూఏఈ ఉపాధ్యక్షుడు మల్లేశ్‌ కోరేపుతో కలిసి గణేశ్‌ కంపెనీకి వెళ్లారు.

అక్కడ క్యాంప్‌ బాస్‌ విజయ్‌ను కలుసుకొని గణేశ్‌ మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అక్కడే ఉన్న గణేశ్‌ గదికి వెళ్లి ఆయన బెడ్‌ను చూసి కొద్దిసేపు భావోద్వేగానికి గురయ్యారు.

అనంతరం కంపెనీ హెచ్‌ఆర్‌ కలిసి (GWAC) యూఏఈ ఉపాధ్యక్షుడు మల్లేశ్‌తో పాటు కంపెనీ బాస్‌ విజయన్‌తో కలిసి అక్కడి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రిపోర్ట్‌ త్వరగా ఇప్పించాలని కోరారు.

కంపెనీ హెచ్‌ఆర్‌తో మాట్లాడి గణేశ్‌ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి పంపే ఏర్పాటు చేయాలలన్నారు. అంతకుముందు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మృతుడు గణేశ్‌ రూమ్‌కు వెళ్లి వారి కుటుంబసభ్యులకు వీడియో కాల్‌ చేసి ధైర్యం చెప్పారు.

‘నేనున్నాను’ అంటూ భరోసా కల్పించారు. ఆది శ్రీనివాస్‌ వెంట GWAC యూఏఈ అధ్యక్షుడు రవి కటుకం, రుద్రంగి మండల అధ్యక్షుడు బొల్లి కుమార్, మోతె బాబు, నరేశ్‌, గగన్ ఆకుల, రాజు తదితరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here