ఇందిరమ్మ రాజ్యమంటే నిర్బంధం, నయవంచన

0
40

– రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ
– బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

కాంగ్రెస్‌ ఇందిరమ్మ రాజ్యమంటే నిర్బంధం, నయవంచన అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఇటీవల ఆయన ఓ బహిరంగ సభ ద్వారం సీఎం రేవంత్‌ రెడ్డిని పరుష పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు బాల్క సుమన్‌కు నోటీసులు అందించిన అనంతరం ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో బాల్క సుమన్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ధ్వజమెత్తారు.

ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక క్రిమినల్‌ అని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు నోటీసు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఒక ముఖ్యమంత్రి క్రిమినల్‌ అయినప్పడు ఆయన నుంచి ఇంతకంటే గొప్పగా ఏమీ ఆశించలేమన్నారు. ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా ఆపేయాలని డిమాండ్‌ చేశారు. ‘నేను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన అని కేసులు పెడుతున్న ప్రభుత్వం.. మరి మా ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పై ఆయన చేసిన వ్యాఖ్యల పైనా కేసులు పెట్టాలి’ అని డిమాండ్‌ చేశారు.

మా పార్టీ మాజీ మంత్రులు, నాయకులపై అడ్డగోలుగా మాట్లాడుతూ పరుష పదజాలం వాడుతున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుని పైనా కూడా కేసులు పెట్టాలన్నారు. తాము ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యాదులు చేసిన కేసు నమోదు చేయడం లేదన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్‌ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here