నాపేరు మీద 52 ఎకరాల భూమి లేదు

0
27

– నా భార్య పేరుపై 17 ఎకరాలు ఉంది
– ఆర్థిక అవసరాలు ఉండడంతో 2021లోనే ఆ భూమిని అమ్మేశాం
– మాజీ ఐఏఎస్‌ రజత్‌ కుమార్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం హేమాజీపూర్‌లో భూమి కొనుగోలు చేసింది నిజమేనని మాజీ ఐఏఎస్‌ రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అసలు తన పేరిట 52 ఎకరాల భూమి లేదని స్పష్టం చేశారు. తన పేరుపై 15 ఎకరాలు, తన భార్య పేరుపై 17 ఎకరాల భూమి ఉందన్నారు. 2013లో తమ సేవింగ్స్‌ నుంచి అక్కడ భూములను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

అయితే ఆర్థిక అవసరాల ఉండడంతో ఆ భూమిని 2021లోనే అమ్మేసినట్లు చెప్పారు. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం ప్రభుత్వ అనుమతితోనే తను భూమిని కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. భూమి అమ్మే ముందు కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని ట్రాన్సాక్షన్‌ చేసినట్లు చెప్పారు. ఇదిలాఉంటే ధరణి భూ యజమానిగా పేరుండడంపైనా ఈ మాజీ ఐఏఎస్‌ స్పందించారు. ఇప్పటివరకు ధరణిలో తన పేరు ఉందో లేదో తెలియదన్నారు. ఒకవేళ ధరణిలో భూమి నాపేరుపై ఉన్నా తనకు సంబంధం లేదన్నారు.

నేను ఆ భూమిని అమ్మేశానని, అది కొనుగోలు చేసినవారే చూసుకోవాలన్నారు. ధరణిలో లోపం ఉంటే తానేం చేస్తానని బదులివ్వడంతో పాటు ధరణిపై ఎలాంటి కామెంట్‌ చేయనని చెప్పారు. అలాగే తాను ఇప్పుడు సర్వీస్‌లో నేను అని ఇరిగేషన్‌కు సంబంధించి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేయడంతో పాటు తనకు ఇప్పుడు దానిపై మాట్లాడే అర్హత లేదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులపై విచారణ జరుపుతున్నారని, విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని మాజీ ఐఏఎస్‌ రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here