జైస్వాల్ డబుల్ సెంచరీ
రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్
జడేజాకు ఐదు వికెట్లు
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ టెస్టులో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి, మొత్తం 7 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 196 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడోరోజు ఆదివారం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 430 పరుగుల పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (214, నాటౌట్) తో పాటు శుభ్‌మన్ గిల్ (91), సర్ఫరాజ్ ఖాన్ (68, నాటౌట్) రాణించారు.
అనంతరం 556 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో మార్క్ వుడ్( 33) అత్యధిక స్కోరు.
టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ 2, జస్ప్రీత్ బూమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.
ఇదిలాఉంటే ఇటీవలి కాలంలో ఇంగ్లాండ్ జట్టుకు ఇది అతిపెద్ద ఓటమి. ఇరుజట్లపై నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ టెస్టు సిరీస్‌లో భారత్ 2-1తేడాతో ముందంజలో ఉంది.
భారీ తేడాతో ఇంగ్లాండ్ ఓడిన మ్యాచ్‌లివే..
562 ఓవల్ ఆస్ట్రేలియా 1934
434 రాజ్‌కోట్ భారత్ 2024
425 మాంచెస్టర్ వెస్టిండీస్ 1976
409 లార్డ్స్ ఆస్ట్రేలియా 1948
405 లార్డ్స్ ఆస్ట్రేలియా 2015
భారీ తేడాతో భారత్ గెలిచిన టెస్టు మ్యాచ్‌లివే..
434 రాజ్‌కోట్ ఇంగ్లాండ్ 2024
372 ముంబై న్యూజిలాండ్ 2021
337 ఢిల్లీ దక్షిణాఫ్రికా 2015
321 ఇండోర్ న్యూజిలాండ్ 2016
320 మొహాలీ ఆస్ట్రేలియా 2008