– ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం
– ఇకమీదట ప్రభుత్వ ఉద్యోగులే
ప్రజానావ/హైదరాబాద్: ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఈ మేరకు మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో ఇకమీదట ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకుగాను అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 43, 373 మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కీలక నిర్ణం తీసుకుందని, ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించే బిల్లును 3న నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు.